Featured post

SHORT TIME - MAKE UP TIPS

Monday 16 November 2020

మొటిమలు మచ్చలు తగ్గడానికి సులభమైన చిట్కాలు

 


దాల్చిన చెక్క పొడి మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది యాపిల్ సి డా ర వెనిగర్ చర్మం పీహెచ్ స్థాయి లను సమతుల్యం చేసి sebum ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా చర్మరంధ్రాలు లోని మలినాలను తొలగించి వాటిని బిగుతుగా చేస్తుంది. బేకింగ్ సోడా మొటిమలను తగ్గిస్తుంది. దీనిలోఉండే యాంటీబ్యాక్టీరియల్ , యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల నియంత్రణకు తోడ్పడతాయి. ఇది చర్మం మీద మృతకణాలను తొలగిస్తుంది. అయితే ఈ మూడింటిని పలచగా చేసి మాత్రమే వాడాలి. స్వచ్ఛమైన పసుపు, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి వాడినా ఫలితం ఉంటుంది. చర్మాన్ని తేనె తేమగా ఉంచుతుంది. కొబ్బరి నూనె పసుపులో కలిపి రాయడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి. తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి రాశి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఆలివ్ ఆయిల్, తేనె సమాన పరిమాణంలో తీసుకుని రాశినా ఫలితం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో రెట్టింపు తేనె కలిపి రాయడం వల్ల మొటిమలు మచ్చలు తొలగిపోతాయి. బేకింగ్ సోడా లో రెట్టింపు తేనెను కలిపి రాయడం వల్ల మృత కణాలు తొలగడంతో పాటు ముఖ చర్మం చక్కగా మెరుస్తుంది.

No comments:

Post a Comment