చసంరక్షణ కోసం అందరము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. అయితే వాటిని ఓ పద్ధతి ప్రకారం చేయగలిగితే మనం కోరుకున్న మార్పు సాధ్యమవుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే...
శుభ్రం చేయాలి- రోజు కనీసం నాలుగు సార్లు అయినా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందులో రెండు సార్లు తప్పనిసరిగా నాణ్యమైన ఫేస్ వాష్ ని వినియోగించాలి. లేదంటే పెసర పిండిలో కాసిని పాలు కలిపి ముఖానికి రుద్దాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగితే సరి. మురికి వదిలి చర్మం తాజాగా కనిపిస్తుంది.
మృతకణాల తొలగింపు...10 రోజులకు ఒకసారైనా చర్మంపై పేరుకున్న మృత కణాలను తొలగించాలి. రోజు బాత్ సాల్ట్ ని ముఖానికి రాసుకోవాలి. చేతులు తడుపుకుంటూ మృదువుగా ఓ పది నిమిషాలు రుద్దాలి. ఆపై చల్లటినీళ్లతో కడిగేయాలి దీనివల్ల మేని మృదువుగా మారుతుంది.
ఆవిరి పట్టడం... ముందుగా ముఖాన్ని శుభ్రం చేయాలి. తర్వాత గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి చుక్క లావెండర్ ఆయిల్ ని కలిపి ముఖానికి ఆవిరి పట్టండి. ఇలా చేయడం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. మొటిమలు బాధించవు
No comments:
Post a Comment